Header Banner

కోడి క‌త్తికి తక్కువ - గొడ్డ‌లికి ఎక్కువ - జ‌గ‌న్ కు జ‌న‌సేన కౌంట‌ర్! ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా..

  Wed Mar 05, 2025 19:51        Politics

11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం... పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని జగన్ ఇవాళ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో, జగన్ కామెంట్స్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. క్రిమినల్ మైండ్ తో వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని విమర్శించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ ను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. "నువ్వు కోడికత్తికి ఎక్కువ... గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా! నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు" అంటూ నాదెండ్ల ధ్వజమెత్తారు. ఇక జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. "సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు... తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు... ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా" అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Janasena #pawanakalyan #Votes #AndhraPradesh #Rajolu